Dailyhunt

కారు ప్రమాదంలో వ్యక్తి మరణం

ప్రకాశం, 04 ఏప్రిల్ (హి.స.)

కురిచేడు, : ప్రాణ స్నేహితుడి కోరిక మేరకు ఆయన దూరప్రాంతం నుంచి బయలుదేరి వచ్చారు. మిత్రుడితో సరదాగా కబుర్లు చెబుతుండగానే..కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఆయన ఉభయ రాష్ట్రాల ఎన్సీఆర్సీ (నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్) ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారని బాధితులు చెప్పారు. ఈ విషాద ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పెద్దవరంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..మార్కాపురం జిల్లా బేస్తవారపేటకు చెందిన మారెళ్ల ప్రసాద్, కిరణ్మయి దంపతులు వృత్తిరీత్యా డాక్టర్లుగా పనిచేస్తూ విశాఖపట్నంలో నివాసముంటున్నారు. గురువారం పెద్దవరం గ్రామంలో వారి బంధువుల ఇంట్లో వివాహం ఉండటంతో బుధవారం రాత్రి డ్రైవర్ను ఏర్పాటుచేసుకుని కారులో బయలుదేరారు. అదే సమయంలో ప్రసాద్ తన ప్రాణ మిత్రుడైన..మల్కాజిగిరికి చెందిన మునగాల వెంకట లక్ష్మీనాగేశ్వరరావు (55)కు ఫోన్ చేసి తమ బంధువుల పెళ్లికి రావాల్సిందిగా కోరారు. నాగేశ్వరరావు ఉభయ రాష్ట్రాల ఎన్సీఆర్సీ (నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్) ఛైర్మన్గా వ్యవహరిస్తుండగా, ప్రసాద్ అందులో సభ్యుడిగా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu