Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కళ్యాణదుర్గం మండలం లోని ఎర్రంపల్లి గేటు.వద్ద బొలెరో.వాహనం బోల్తా

కళ్యాణదుర్గం, 04 మే (హి.స.)

ర్రంపల్లి గేట్ వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో మామిడి కాయలు రోడ్డుపాలయ్యాయి. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు మామిడి కాయలను బొలెరో వాహనంలో బెంగళూరుకు తరలిస్తున్నారు.

కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి వద్దకు రాగానే వాహనం టైరు పగిలి అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. అందులో ఉన్న మామిడి కాయలు పక్కనే ఉన్న గుంతలో పడ్డాయి. చోదకుడు బాబు చిన్నపాటి గాయాలతో బయటపడగా వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మామిడి పంట రోడ్డుపాలు కావడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu