Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కనీసం గోనె సంచులు కూడా సమకూర్చలేకపోతున్నారు: గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి , 20 మే (హి.స.)

తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

ముందస్తు ప్రణాళికా లోపం వల్లే అన్నదాతలు రోడ్లపై అల్లాడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కనీసం గోనె సంచులు సమకూర్చడంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రికి 75 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంది కానీ, రైతుల కష్టాలు పట్టించుకోవడానికి తీరిక లేదని... రేవంత్ 'నకిలీ రైతు బిడ్డ' అని గండ్ర ఎద్దేవా చేశారు. క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని, గతంలో కేసీఆర్ కరోనా సమయంలోనూ ప్రతి గింజా కొన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే బీఆర్ఎస్ తరపున పోరాటాలు ఉద్ధృతం చేస్తామని గండ్ర హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu