Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర హోం కార్యదర్శిగా గోవింద్ మోహన్ పదవీకాలం పొడిగింపు

కేంద్ర హోం కార్యదర్శిగా గోవింద్ మోహన్ పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ, 05 ఆగస్టు (హి.స.)

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి

(Home Secretary)గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ (Govind Mohan, IAS SK:89) పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్' (DoPT) బుధవారం (ఆగస్టు 5) ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం, 2026 ఆగస్టు 22 తో ముగియనున్న ఆయన పదవీకాలం.. 2027 ఆగస్టు 22 వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందైతే అది) పొడిగించబడింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1958లోని రూల్ 16 (1A, FR 56 (d) నిబంధనలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకుంది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగ కార్యదర్శి మనీషా సక్సేనా డిక్రీపై సంతకం చేసి ఈ ఉత్తర్వులను అధికారికంగా విడుదల చేశారు.

కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ పదవీకాలం పొడిగింపు..

కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి

(Cabinet Secretary) విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆయన పదవీకాలం పొడిగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. టీవీ సోమనాథన్ మునుపటి పదవీకాలం 2026 ఆగస్టు 30తో ముగియనుండగా, కొత్త ఉత్తర్వుల ప్రకారం ఆయన 2027 ఆగస్టు 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu