Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

కుప్పం, 20 మే (హి.స.)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి.

ఈ రోజు ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వారి వెంట పలువురు స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu