హైదరాబాద్, 02 జూన్ (హి.స.)
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చలు విజయవంతమైతే ప్రాంతీయ యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిన జైరాం రమేశ్, పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ చర్చలు సఫలమైతే అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై ఒత్తిడి తగ్గి ధరలు దిగివస్తాయని, ఇది భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi
