Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం.. రామగుండం పోలీస్ కమిషనర్

లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం.. రామగుండం పోలీస్ కమిషనర్

Hindusthan Samachar 7 months ago

గోదావరిఖని, 05 ఏప్రిల్ (హి.స.)

గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు

ఆయన చేయడం చట్ట విరుద్ధమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.

ఆదివారం కమిషనర్ కార్యాలయంలో మాట్లాడారు. పీసీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు చట్టబద్ధమైన నమోదు ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు. మొదటిసారి నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. పునరావృతం అయితే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల వరకు అంతకుమించి జరిమానా విధిస్తారని వివరించారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి వైద్య అనుమతిపత్రాన్ని సస్పెండ్ చేయడం, పూర్తిగా రద్దు చేస్తారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu