Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కాపురం చెరువులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

మార్కాపురం చెరువులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

మార్కాపురం, 22 మే (హి.స.)

మార్కాపురం పట్టణ పరిధిలోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. చెరువులో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అయితే మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి, మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్సై విశ్వనాథరెడ్డి కోరారు. మృతుడు ఎవరు? ఎలా చెరువులోకి చేరాడు? ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu