Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మదనపల్లెలో వర్షం

మదనపల్లెలో వర్షం

మదనపల్లె, 30 ఏప్రిల్ (హి.స.)

మదనపల్లెలో బుధవారం సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది.

సాయంత్రం 4:30గంటల నుంచి అర్థరాత్రిదాకా పాటు చిరుజల్లులు కురిశాయి. మొదటగా ఓ స్థాయిలో ఈదురు గాలులు వీయగా, తర్వాత తంపర్లతో మొదలైన వర్షం కొంతసేపటికి జల్లులుగా మారి రోడ్లపై నీరు ప్రవహించే స్థాయిలో కురిసింది. ఈదురు గాలులకు హోర్డింగ్లు, రోడ్లపై అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడగా, గాలులతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు నెలలుగా ఓ పక్క వేడి, మరోపక్క ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. మరోవైపు తీవ్రమైన ఎండలతో మెట్ట ప్రాంతాల్లో ఎండిపోయిన వ్యవసాయ బోర్లతో నీటి సరఫరా లేక ఎండుముఖం పడుతున్న టమోటా పంటకు కాస్త ప్రాణం పోసినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu