Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మంత్రి నారాయణను క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు కలిశారు

అమరావతి, 04 ఆగస్టు (హి.స.)

మంత్రి నారాయణను క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు ఈరోజు (మంగళవారం) కలిశారు. మంత్రికి అభినందనలు తెలిపి సన్మానించారు. భవన నిర్మాణ అనుమతుల్లో నిబంధనలు సులభతరం చేస్తూ ఇటీవల జీవో నంబర్161 జారీ చేసిన విషయం తెలిసిందే.

మునిసిపల్ శాఖ నిబంధనలు సరళతరం చేయడంలో కీలకంగా వ్యవహరించినందుకు మంత్రి నారాయణను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊపు వచ్చిందని తెలిపారు.

డిక్లరేషన్ విధానం నుంచి సెట్ బ్యాక్ల తగ్గింపు వరకూ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వల్లే రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధి చెందిందని కొనియాడారు. తిరుపతి, రాజమండ్రిలో త్వరలో నిర్వహించే క్రెడాయ్ ఎక్స్పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం పలికారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ మాస్టర్ ప్లాన్ను త్వరగా ఫైనలైజ్ చేయాలని క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu