Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీభూమి - మీహక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మీభూమి - మీహక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అనంతపురం, 04 మే (హి.స.)రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మీభూమి - మీహక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు.

వైసీపీ హయాంలో జగన్ రెడ్డి తన ఫోటోలను పాసుపుస్తకాలపై ముద్రించుకున్నారని, కూటమి ప్రభుత్వం వాటిని తొలగించి రాజముద్రతో అందిస్తోందని ఆమె అన్నారు.

ఇకపై భూ యజమానులకు సంబంధించిన పాసుపుస్తకాలపై రాజముద్ర ఉంటుందని, 'మీభూమి మీ హక్కు' అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలపై నాటి సీఎం జగన్రెడ్డి తన ఫోటోలను ముద్రించుకున్నారన్నారు. దీంతో అప్పట్లోనే ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయన్నారు.

ఈక్రమంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు పాసు పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉంచి పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. రీసర్వే జరిగిన ప్రాంతాల్లో ప్రజలకు పారదర్శకంగా పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 9లోగా పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu