Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీసేవ కేంద్రంలో 'ఫ్యామిలీ సర్టిఫికెట్' పొందండి

మీసేవ కేంద్రంలో 'ఫ్యామిలీ సర్టిఫికెట్' పొందండి

హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో ఏ కుటుంబమైనా తహసీల్దార్ కార్యాలయం లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి తమ 'ఫ్యామిలీ సర్టిఫికెట్' పొందవచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

దీనివల్ల రాష్ట్రంలో ఏ వ్యవస్థలైనా, ఏ సంస్థలైనా మీ కుటుంబ వివరాలను అడిగితే సమాచారం ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని.., ఈ సౌకర్యాన్ని ప్రజాప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. ప్రజాభవన్లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ(ఎస్.ఐ.ఆర్.)పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో రేషన్ కార్డుతో రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే సరకులు, ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం ఇతరత్రా పథకాలను రాష్ట్ర ప్రజలు పొందుతున్నారన్నారు. ఇలా ప్రభుత్వ పథకాలు పొందుతున్న కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు భట్టి వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu