
హైదరాబాద్, 05 మే (హి.స.)
ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్
పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు సంబంధించి బీజేపీ సన్నాహాలు వేగవంతమయ్యాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తార్నాకలో గోడలపై రాతల ప్రచారంలో పాల్గొన్నారు. తార్నాకలోని తాజా కిచెన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

