Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సత్య కుమార్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సత్య కుమార్

ధర్మవరం, 22 మే (హి.స.)ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ రోజు శుక్రవారం పర్యటించారు. ఎన్డీఏ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 'తన ఐదేళ్ల పాలనను ఆటవిక పాలనకు ప్రతీకగా మార్చిన మాజీ సీఎం జగన్ను రాష్ట్ర ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు' అని మంత్రి సత్యకుమార్ అన్నారు.

జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ధ్వజమెత్తారు. 'తన ఆటవిక పాలనను ప్రజలు మరిచిపోతారేమోననే భయంతో నెలకోసారి బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి మహల్లో పత్రికా సమావేశాలు పెట్టనవరం లేదు. నేర చరిత్ర గల కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్కు విలువలతో కూడిన రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు ఏ మాత్రం లేదు. తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డిల ఆలోచనలు, వ్యవహార సరళి రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలుసు. జగన్ పత్రికా సమావేశంలో పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో ఎదుటివారిపై దాడి చేసేలా విఫలయత్నం చేశారు. తనకు అందని ఎత్తులో ఉన్న వారిపై ఉమ్మి వేయాలని చూస్తే అది తనపైనే పడుతుందన్న వాస్తవాన్ని జగన్ గ్రహించాలి. తన తండ్రి వైఎ్సఆర్ శవం సాక్షిగా ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ బేరసారాలు జరిపిన వాస్తవం ప్రజలకు తెలుసు. తండ్రి మరణం పట్ల అనుమానాలుంటే ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు నివృత్తి చేసుకోలేదు? తన తాత హత్యకు కారకులైన వారిని ఉపేక్షించి వదిలేయడం తన మంచితనానికి నిదర్శనంగా జగన్రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. వివేకానందరెడ్డి హత్యకు కారకులైన కుట్రదారులు, హంతకులను కాపాడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇది కూడా ఆయన మంచితనానికి నిదర్శనమా? నూతన వైద్య కళాశాలల నిర్మాణం, నాడు - నేడు పనులకు సంబంధించి నిర్దేశించిన వ్యయం లక్ష్యాల్లో 15 శాతం మాత్రమే ఖర్చు చేసిన మాజీ సీఎం... కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కుటిలత్వం' అని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu