Dailyhunt

నకిలీ ఆధార్ కార్డులు గుర్తించే వ్యవస్థను తేనున్న తిరుమల

తిరుపతి, 04 ఏప్రిల్ (హి.స.), :తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు సహా దర్శన టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుతం భక్తుల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది.

అయితే.. కొందరు ఈ కార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆధార్ వాస్తవికతను నిర్ధారిస్తే తప్ప.. అవి అసలో.. నకిలీవో.. తెలిసే అవకాశం లేదు. కానీ, ఆధార్ కార్డుల వాస్తవికతను గుర్తించే వ్యవస్థ టీటీడీ వద్ద లేదు. ఈ నేపథ్యంలో ముఖ గుర్తింపు(ఫేస్ రికగ్నిషన్)తోపాటు, ఆధార్ నిర్ధారణ వ్యవస్థలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సం బంధించి యూఐడీఏఐ సేవలు వినియోగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు యూఐడీఏఐ అధికారులు టీటీడీ యంత్రాంగంతో పలు అంశాలపై చర్చించారు. ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. దీనికిగాను అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ(ఏయూఏ) రిజిస్ర్టేషన్ కోసం రెండేళ్లకు రూ.20 లక్షలు చెల్లించాలని సూచించారు. యూఐడీఏఐ సేవలు వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత నోటిఫికేషన్ ఇచ్చేలా టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu