Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నకిలీ ఇమిగ్రేషన్ పత్రాలతో కౌలాలంపూర్ వెళ్లేందుకు యత్నం.. వ్యక్తి అరెస్ట్

నకిలీ ఇమిగ్రేషన్ పత్రాలతో కౌలాలంపూర్ వెళ్లేందుకు యత్నం.. వ్యక్తి అరెస్ట్

Hindusthan Samachar 4 months ago

హైదరాబాద్, 01 జూన్ (హి.స.)

నకిలీ ఇమ్మిగ్రేషన్ పత్రాలతో కౌలాలంపూర్ వెళ్ళేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నుస్వామి అనే వ్యక్తి ఆదివారం ఎయిర్ ఏషియా ఏకే-68 విమానంలో కౌలాలంపూర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతని వద్ద ఉన్న పత్రాలను పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులకు ప్రొటెక్షన్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పత్రం ఫెక్ గా నిర్ధారించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu