Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నల్ల కోటు ధరించి కలకత్తా హైకోర్టుకు మమతాబెనర్జి.!

నల్ల కోటు ధరించి కలకత్తా హైకోర్టుకు మమతాబెనర్జి.!

కలకత్తా, 14 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ చీఫ్ మమతాబెనర్జి (Mamata Banerjee) నల్లకోటు ధరించి కలకత్తా హైకోర్టు (Calcutta High Court) కు హాజరయ్యారు.

మమతాబెనర్జి వృత్తిరీత్యా న్యాయవాది (Lawyer) అయినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎన్నడు కూడా ముఖ్యమంత్రి హోదాలో నల్లకోటు ధరించి కోర్టులో వాదించలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ బీజేపీకి అనుకూలంకానీ ఓట్లను తొలగిస్తోందని ఆమె వాదించారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత మమత తొలిసారి నల్లకోటులో కలకత్తా హైకోర్టుకు వచ్చారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆమె హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ ముందు తన వాదనలు వినిపించనున్నారు. ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఇటీవల కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ తరఫున మమతాబెనర్జి తన వాదనలు వినిపించబోతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu