Dailyhunt

నల్లజర్ల పీహెచ్సీలో భారీ అగ్నిప్రమాదం..

నల్లజర్ల , 08 ఏప్రిల్ (హి.స.)

ల్లజర్ల పీహెచ్సీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

భారీ ఎత్తున మంటలు ఎగసిపడగా.. మందులు ఉంచిన డిపార్ట్మెంట్ పూర్తిగా దగ్ధమయింది.

అందులో ఉన్న ఫర్నీచర్, ఇతర వస్తువులు కూడా అగ్నికీలలకు ఆహుతయ్యాయి. పీహెచ్సీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ అగ్నిప్రమాద ఘటనతో పీహెచ్సీలో ఉన్న పేషంట్లు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు విచారణ చేయగా.. విద్యుత్ షార్ట్ సర్కూటే అగ్నిప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్లకు మరో ఆస్పత్రి నుంచి మందులు తెప్పిస్తామని వైద్యాధికారి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu