Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముంబై, 21 ఆగస్టు (హి.స.)అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధంతో వీటి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.

ఈరోజు (శుక్రవారం) ఉదయం 06:30 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,160కి చేరుకుంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,59,280కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,46,010కి చేరుకుంది. అలాగే, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,59,280ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,010గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.2,60,100కి చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu