Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగుల వయోపరిమితి పెంచిన తెలంగాణ ప్రభుత్వం

నిరుద్యోగుల వయోపరిమితి పెంచిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, 19 మే (హి.స.)

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం

ఎదురుచూసే అభ్యర్థులకు ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 34 సంవత్సరాలుగా ఉండగా..

దానిని మరో 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేసే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ జీఓ జారీ చేసింది. నిరుద్యోగ యువత అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ.. పెంచిన వయోపరిమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని, యూనిఫాం సర్వీసుల ఉద్యోగాల పెంపుకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్, అగ్నిమాపక, ఎక్సైజ్ కంట్రోల్, జైలు, అటవీశాఖల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 34 ఏళ్ల వయో నిబంధనే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu