Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

.న్యూజిలాండ్.లో ఉద్యోగం పేరిట మోసం

అమరావతి, 19 మే (హి.స.)

నకాపల్లి పట్టణం, అనకాపల్లి నుంచి లండన్కు ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈ సమయంలో అనకాపల్లి నుంచి లండన్ వెళ్లిన వ్యక్తి అక్కడ ఉద్యోగం పొందాడు. ఉద్యోగం ఎలా వచ్చిందని అడిగితే ఓ వ్యక్తి సాయం చేశాడని చెప్పాడు. అతడిని సంప్రదిస్తే రూ. 20 లక్షలకు టోకరా వేశాడు. దీంతో బాధితుడు అనకాపల్లి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పట్టణ ఎస్సై విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లిలో పాత్రుడి కాలనీకి చెందిన కర్రి సాయి మౌర్య రూపేంద్రరెడ్డి లండన్లో ఎంఎస్ చేశాడు. అదే కాలనీ నుంచి వెళ్లి లండన్లో ఉద్యోగం సాధించిన వ్యక్తితో రూపేంద్రరెడ్డికి పరిచయం ఏర్పడింది. విజయవాడకు చెందిన హరీష్సింగ్ ద్వారా ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న రూపేంద్రరెడ్డి స్వదేశానికి వచ్చాడు. విజయవాడ వెళ్లి హరీష్సింగ్ను కలిసి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. న్యూజిలాండ్లో కొలువు ఉందని చెప్పడంతో గతేడాది మే నుంచి ఈ ఏడాది మే వరకు పలు విడతల్లో రూ. 20 లక్షలు చెల్లించాడు. కొద్దిరోజులుగా హరీష్సింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గుర్తించిన రూపేంద్రరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu