Dailyhunt
ఓ ఇంటివాడైన బెల్లంకొండ శ్రీనివాస్.. తిరుమలలో వైభవంగా వివాహం

ఓ ఇంటివాడైన బెల్లంకొండ శ్రీనివాస్.. తిరుమలలో వైభవంగా వివాహం

తిరుమల, 30 ఏప్రిల్ (హి.స.)

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Hero Bellamkonda Sai Srinivas) వివాహ(marriage) బంధంలోకి అడుగుపెట్టారు.

తిరుమల క్షేత్రంలోని కర్ణాటక అతిథి భవనం సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో ఆయన కావ్య మెడలో మూడుముళ్లు వేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో వేద మంత్రాల సాక్షిగా, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. శ్రీనివాస్ తన కొత్త జీవితాన్ని వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రారంభించడం విశేషం.

అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకతో వీరిద్దరూ నూతన జీవితాన్ని ప్రారంభించారు.

శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేద మంత్రాల సాక్షిగా, సనాతన ధర్మం ప్రకారం శాస్త్రోక్తంగా ఈ పెళ్లి జరిగింది. వధూవరులిద్దరూ ప్రముఖ డిజైనర్ శ్రావణ్ కుమార్ రూపొందించిన సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు.

తిరుమలలో కేవలం సన్నిహితుల మధ్య వివాహం జరగగా, సినీ పరిశ్రమలోని సహచరులు మరియు ఇతర ప్రముఖుల కోసం మే 1 (శుక్రవారం) నాడు హైదరాబాద్లో భారీ వివాహ విందు (Reception) ఏర్పాటు చేయనున్నారు. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సాయి శ్రీనివాస్, ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాలు..

టైసన్ నాయుడు: సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హైందవ: లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్. దీంతో పాటు 'భైరవం' అనే మరో సినిమా కూడా సెట్స్పై ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu