Dailyhunt
పాక్ మధ్యవర్తిత్వం సక్సెస్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ

పాక్ మధ్యవర్తిత్వం సక్సెస్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ

ఇస్లామాబాద్ 08 ఏప్రిల్ (హి.స.)

ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ జరిపిన దౌత్యపరమైన చర్చలు ఊహించని ఫలితాన్ని ఇచ్చాయి.

వారితో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించారు. శాశ్వత శాంతి దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రపంచ క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కూడా ధృవీకరించడంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. దీనికి ప్రతిగా, మధ్యప్రాచ్యంలోని ప్రాంతీయ స్థావరాల నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవడానికి అమెరికా సమ్మతించింది. ఈ మేరకు ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో ఉభయ దేశాల ప్రతినిధులు సమావేశమై '10 పాయింట్ల శాంతి ఒప్పందం' ప్రణాళికపై చర్చించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu