Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఢిల్లీ,22 మే (హి.స.)జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ. 9న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

ఏపీలో నాలుగు స్థానాలకు..

ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీ కాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని నాలుగు స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.

తో

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu