Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ముంబై, 20 జూన్ (హి.స.)రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు.. తగ్గుతున్నాయి.. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతోపాటు..

ముడి చమురు ధరలు పడిపోవడం లాంటి కారణాలతో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీ తగ్గాయి.. గోల్డ్ పై ఏకంగా రూ.3,600 వరకు ధర తగ్గి.. 1,45,860 వద్ద ట్రేడయింది. అయితే.. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. పలు వెబ్సైట్ల ఆధారంగా.. శనివారం (జూన్ 20, 2026 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,33,690 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,000 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu