Dailyhunt
పెన్నహోబిళంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - పట్టువస్త్రాలుసమర్పించిన మంత్రి

పెన్నహోబిళంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - పట్టువస్త్రాలుసమర్పించిన మంత్రి

అనంతపురం , 06 మే (హి.స.)

అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో మడుగు తేరు కార్యక్రమం వైభవంగా జరిగింది.

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది.

ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదే విధంగా లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల సౌకర్యం లేక అసహనానికి గురవుతున్నారు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఆలయానికి వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు లేక అవస్థలతో దర్శనం చేసుకోవాల్సి వస్తోంది.భక్తుల సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్లు ఆలయ ఈవో విజయ్కుమార్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీరు, వసతి, భోజన సదుపాయం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ఉత్తర ద్వారం ముందు చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu