Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్లాస్టిక్ రహిత ఏపీకై మంత్రి బీసీ జనార్దన్ పిలుపు

ప్లాస్టిక్ రహిత ఏపీకై మంత్రి బీసీ జనార్దన్ పిలుపు

కర్నూలు, 16 మే (హి.స.)సంజామల మండల కేంద్రంలో నిర్వహించిన 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

సంజామల మండల కేంద్రంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకున్న మంత్రి. సంజామల మండల టిడిపి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్లాస్టిక్ వినియోగము వలన అనర్థాలు, చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, సామాన్య ప్రజలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నేతలు. సంజామలలోని స్థానికంగా ఉన్న షాపులను సందర్శించి ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించిన చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. షాపు యజమానులు, దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరిన మంత్రి. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ వినియోగిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడరని హెచ్చరించిన మంత్రి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రతి 3 వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ బనగానపల్లె పట్టణంలో 3 నెలలు పాటు ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తే 70 - 80% ప్లాస్టిక్ నివారించగలిగాం

మన జీవితంలో ప్రతి దశలో భాగమైన ప్లాస్టిక్ ను నివారించేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాలి. ప్రజల్లో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి నుంచే స్వర్ణాంధ్ర - స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలి. ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి.

ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టం, అనారోగ్యం బారిన పడుతున్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సమాజంలో ప్లాస్టిక్ కారణంగా అనేకమంది క్యాన్సర్ బారిన పడుతున్నార. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చెత్త తెచ్చి డ్రైనేజీ కాలువల్లో, వీధుల్లో వేస్తున్నారు.. ఇది అనారోగ్యాలకు కారణం అవుతుంది. డ్రైనేజీల్లో చెత్త అడ్డుగా నిలబడి రోడ్ల మీదకి బురద వచ్చి చేరే పరిస్థితి నెలకొంది. చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడు మాత్రమే చెత్తను ఆ వాహనాల్లో విధిగా వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబు కూడా పాల్గొని ప్రజలకు ప్లాస్టిక్ పై చైతన్యం, అవగాహన కల్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu