Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పొదుపు చర్యలు.పాటించాలంటూ.ఆన్లైన్ ద్వారా టీడీపీ మహానాడు

కృష్ణాజిల్లా, 16 మే (హి.స.)

పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పొలిట్బ్యూరో సభ్యులు, తదితర ముఖ్య నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో క్లస్టర్స్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహానాడు ఉద్దేశాలు, నిర్ణయాలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియచేస్తామని తెలిపారు. యుద్ధ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu