Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

మద్దికెర, , 14 మే (హి.స.)తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో ఎల్.సుధాకర్ పేర్కొన్నారు. ఈ రోజు మద్దికెరలో ప్రభుత్వ బడి పిలుస్తుంది..

మన పిల్లల భవిష్యత్తు కోసం ఉత్తమ ఎంపిక ప్రభుత్వ పాఠశాలలు అంటూ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, బ్యాగ్లు, షూస్, పౌష్టికాహారం కూడిన మధ్యాహ్న భోజనం అమ లు చేస్తుందన్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చేర్పించి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎనలేని కృషి చేస్తున్నార న్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో శత శాతం ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలని డీఈవో సుధాకర్ అన్నారు. బుధవారం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానం వచ్చిన ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన దామోదరం కుమార్తె సౌమ్యకు(570 మార్కు)ఘనంగా సన్మానించారు. మండల ఉపాధ్యాయుల సమావేశంలో మండలం లోని పాఠశాలలో పాస్, ఫెయిల్ శాతం వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల న్నారు. మద్దికెర మండలం 80 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకు న్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu