Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించండి : దేవరకద్ర ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించండి : దేవరకద్ర ఎమ్మెల్యే

మహబూబ్నగర్, 22 మే (హి.స.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీని అనుకున్న స్థాయిలో ప్రచారం కావడం లేదనీ, ఈ విషయాన్ని గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

గురువారం ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు సరఫరా, సన్న బియ్యం పంపిణీ తదితర పథకాలను అమలు చేయడం వల్ల.. ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. వరి ధాన్యం ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆలోచనలు లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను గురించి ప్రజలకు తెలియ చెప్పకుంటే వాళ్లు చెప్పిందే నిజం అని నమ్మే పరిస్థితులు ఉంటాయి. తప్పుడు ప్రచారాలు లేకుండా ప్రజలకు నిర్భయంగా నిజాలు చెప్పండి. ప్రభుత్వ పథకాలను గురించి మరింతగా వివరించాలి అని అధికారులకు ఎమ్మెల్యే జీఎంఆర్ సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలి అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లకుండా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu