Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్ను ఆపేయండి

ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్ను ఆపేయండి

హైదరాబాద్, 17 మే (హి.స.)ఐపీఎల్‌ 2026 సీజన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రాన్ని జపించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్‌ బాఘేల్‌ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేస్తూ.. ఐపీఎల్‌ను వెంటనే నిలిపివేయాలని మోదీని కోరారు. స్టేడియాలకు వేలాది మంది అభిమానులు ప్రయాణించడం వల్ల భారీగా ఇంధనం వినియోగమవుతోందని, విదేశీ ఆటగాళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయని, బెట్టింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్‌ను ఆపేయండి. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. విదేశీ కరెన్సీ చెల్లింపులు తగ్గుతాయి. బెట్టింగ్ కూడా ఆగుతుంది అంటూ బాఘేల్ తన పోస్టులో రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu