Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలి'.. మంత్రి జూపల్లి

'ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలి'.. మంత్రి జూపల్లి

వనపర్తి, 14 మే (హి.స.)

ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారోత్సవాలు భాగంగా గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనం పై అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిలు కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని 5.10 లక్షలతో పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి విజ్ఞప్తి మేరకు గ్రంధాలయం అభివృద్ధికి ఒక కోటి రూపాయలు మంజూరు చేస్తానన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్షరాస్యత పేరుగుతున్న, నాణ్యమైన విద్య కొదువగా ఉందని, నైపుణ్యాన్ని, నాణ్యత కలిగిన విద్యా పెంపొందించేందుకు గ్రంథాలయాలు పట్టు కొమ్మలుగా నిలుస్తాయన్నారు.

ప్రతి నియోజకవర్గంలో రూ.10 లక్షలతో పుస్తకాలు పట్టణ పౌర ఆలయాలు(పీ.పీ.సీ)లలో అన్ని రంగాల పుస్తకాలు ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని పర్యాటక కేంద్రాలను రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు అవసరమన్నారు.

ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. విద్యా వారోత్సవాలలో భాగంగా జిల్లా గ్రంథాలయ మొదటి అంతస్తు భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరుగు దొడ్లు, బుక్స్, సామాగ్రితో పాటు డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రజలు, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.2 కోట్లు నిధులు

మంజూరు చేసి నియోజకవర్గంను సాంస్కృతిక, సంప్రదాయాలను ఉట్టి పడేలా వసతులు కల్పించాలని, మౌలిక వసతులు కల్పన కు సహకరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu