Dailyhunt
పులివెందుల : గ్రామాల్లో విజిబుల్ పోలింగ్ పై ప్రజలకు అవగాహన

పులివెందుల : గ్రామాల్లో విజిబుల్ పోలింగ్ పై ప్రజలకు అవగాహన

పులివెందుల, 05 మే (హి.స.)

లింగాల మండలం చిన్నకుడాలలో విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జగదీశ్వర్రెడ్డి ప్రజలతో నేరుగా మాట్లాడి, చోరీలను నివారించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, మహిళా భద్రత, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నివారణ లక్ష్యంగా పనిచేయాలని, విజిబుల్ పోలింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని సూచించారు. త్వరలో స్థానికసంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాల నివారణపై యువతను చైతన్య పరచాలని సూచించారు. తనిఖీలో భాగంగా పోలీస్స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దరఖాస్తులో ఉన్న కేసులను పరిశీలించి తనిఖీ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu