Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

హనుమకొండ, 05 మే (హి.స.)

హనుమకొండ జిల్లాలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (సుబేదారి) మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంగళవారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ, మంత్రి దనసరి అనసూయ సీతక్కలతో కలిసి ప్రారంభించారు.

ఈ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను మంత్రులు సందర్శించి, రైతులతో మమేకమయ్యారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలపై అందిస్తున్న వివరాలను ఆసక్తిగా అధికారులు పరిశీలించారు.

రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మేళా ద్వారా రైతులకు అందుతున్న అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రులు పేర్కొన్నారు. రైతులు కొత్త పద్ధతులు అవలంబించి దిగుబడులు పెంచుకొని, ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu