Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో అభివృద్ధి పనుల జోరు.. ఉచిత తాగునీరు, యంగ్ ఇండియా స్కూళ్లకు నిధుల విడుదల

రాష్ట్రంలో అభివృద్ధి పనుల జోరు.. ఉచిత తాగునీరు, యంగ్ ఇండియా స్కూళ్లకు నిధుల విడుదల

హైదరాబాద్, 01 జూన్ (హి.స.)

రాష్ట్రంలో ప్రజా మౌలిక సదుపాయాలు,సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ఆర్థిక శాఖ(Finance Department) కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు గాను భారీగా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత తాగునీటి పథకానికి ఊరట లభించింది. ఈ పథకానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ కింద జలమండలికి (HMWSSB) రూ.75 కోట్ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో నీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడటంతో పాటు, బకాయిల చెల్లింపులకు మార్గం సుగమం కానుంది.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.414 కోట్లు..

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (Young India Integrated Residential Schools) నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఈ పాఠశాలల భవన నిర్మాణ పనుల కోసం ఆర్థిక శాఖ రూ.414 కోట్లు కేటాయించింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఒకేచోట అత్యుత్తమ వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu