Dailyhunt
రాష్ట్రంలో మరో భూకుంభకోణం.. హరీశ్ రావు ఆరోపణలు

రాష్ట్రంలో మరో భూకుంభకోణం.. హరీశ్ రావు ఆరోపణలు

హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్ కేంద్రంగా రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు.

నాదర్ గుల్ లోని దళితులకు చెందిన 374 ఎకరాల భూమిలో 600 మంది పేద రైతులు ఉన్నారని ఈ భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల భూములకు రక్షణ లేదన్నారు. రక్షకుడే భక్షకుడు అయ్యారని ప్రభుత్వ పెద్దలే గద్దల్లా భూములు తన్నుకు పోతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ ఈ భూములను కాపాడితే ఈ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. నాదర్ గుల్ భూములు తనవిగా శివరాజ్ కోర్టులను ఆశ్రయించారు. ఈ భూములను అమ్ముకోవడానికి వీల్లేదని హైకోర్టు చేప్పింది. ఆర్డీవో నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu