Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు(అనంతపురం), 14 మే (హి.స.): ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హైదరాబాద్-బెళగావి (వయా గుంతకల్లు) మధ్య వీక్లీ రైలును నడపాలని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.

బెళగావి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (17072) రైలు ఈ నెల 15 నుంచి మొదలవుతుంది. బెళగావిలో శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకి హైదరాబాద్కు చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు ఈ నెల 21వ తేదీ నుంచి హైదరాబాద్లో గురువారాల్లో సాయంత్రం నాలుగున్నరకు బయలుదేరి శుక్రవారం ఉదయం పదిన్నరకు బెళగావికి చేరుకుంటుంది. ఈ రైలు హైదరాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, దరోజి, తోరణగల్లు, హోస్పేట, కొప్పల్, గదగ్, హుబ్లీ, ధార్వాడ, లోండా, ఖానాపూర్ స్టేషన్ల మీదుగా బెళగావికి చేరుతుంది.

ప్రత్యేక రైళ్ల రెగ్యులరైజేషన్

-

గుంతకల్లు మీదుగా నడిచే రెండు ప్రత్యేక రైళ్లను రెగ్యులరైజ్ చేశారు. బెంగళూరు-బీదర్ ప్రత్యేక రైలును (16559) ఈ నెల 15వ తేదీ నుంచి బైవీక్లీ (శుక్ర, ఆదివారాలు) ఎక్స్ప్రె్సగా రెగ్యులరైజ్ చేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలును(16560) ఈ నెల 16వ తేదీ నుంచి శని, సోమవారాల్లో నడిచే బైవీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాద్గిర్, వాడి, షాహాబాద్, కలబురగి, హుమ్నాబాద్ స్టేషన్ల మీదుగా వెళుతుంది.

-

బెంగళూరు కంటోన్మెంటు-కలబురగి (16563) ఎక్స్ప్రె్సను ఈ నెల 16 నుంచి వీక్లీ (శనివారాల్లో నడిచే) ఎక్స్ప్రె్సగా రెగ్యులరైజ్ చేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (16554)ను 17వ తేదీ నుంచి ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, వాడి, షాహాబాద్ స్టేషన్ల మీదుగా వెళుతంది.

తాడిపత్రి మీదుగా తిరుపతి-ఓకా-తిరుపతి మధ్య వీక్లీ రైలు ఈ నెల 14న ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-ఓకా వీక్లీ ఎక్స్ప్రెస్ (19559) రైలు తిరుపతిలో ఉదయం 8.15 గంటలకు బయలుదేరి, 11.54 గంటలకు తాడిపత్రికి వచ్చి, మరుసటి రోజు ఉదయం 11.50 గంటలకు ఓకాకు చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (19560) ఓకాలో రాత్రి 11.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.13 గంటలకు తాడిపత్రికి, రాత్రి 11.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్నగర్, కాచిగూడ, బోలారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, హెచ్ఎ్స నాందేడ్, పూర్ణా, బస్మఠ్, హింగోలి, వాసిం, అకోలా, మల్కాపూర్, భూసావల్, జల్గావ్, అమల్నేర్, నందుర్బార్, ఉడ్నా, భరుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, విరంగం, సురేంద్రనగర్, వాకనేర్, రాజ్కోట్, హాపా, జాంనగర్, ఖంభలియా, ద్వారకా స్టేషన్ల మీదుగా ఓకాకు వెళుతుంది.

సికింద్రాబాద్-బెళగావి, చర్లపల్లి-బెళగావి (వయా గుంతకల్లు) మధ్య రెండు వీక్లీ రైళ్లను నడపనున్నారు. చర్లపల్లి-బెళగావి వీక్లీ ఎక్స్ప్రెస్ (17075) ఈ నెల 16 నుంచి శనివారాల్లో చర్లపల్లిలో మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.30కి బెళగావికి చేరుకుంటుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు ఈ నెల 17 నుంచి ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బెళగావిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.45 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుంది. ఈ రైలు చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, బళ్లారి, దరోజి, తోరణగల్లు, హోస్టేట, కొప్పల్, గదగ్, హుబ్లీ, ధార్వాడ, లోండా, ఖానాపూర్ స్టేషన్ల మీదుగా బెళగావికి చేరుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu