Dailyhunt
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

విజయనగరం, 02 ఏప్రిల్ (హి.స.)జిల్లాలోని రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో జాప్యం చేస్తే తగదని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరే ట్ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు.

ఫిబ్రవరి, మార్చి నెలకు సంబందించి ముటేషన్లకు ఐదు రకాలు కరెక్షన్లు తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా సేవలు అందించాలని కోరారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ వివిధ ధశల్లో ఉన్న వెబ్ ల్యాండ్ పోర్టింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఫేజ్ -4 పరిధిలో 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ 96,779.71 ఎకరాల వరకూ పూర్తయిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలు, పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షితమైన తాగు నీరందించాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఆయా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆర్వో ప్లాంట్లు లేని పాఠ శాలలు, వసతి గృహాల జాబితాను సిద్ధం చేయాలని, అక్కడ జలజీవన మిషన్ ద్వారా కుళాయిలు వేసేందుకు గల అవకాశాలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిశీలించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu