Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు, 15 మే (హి.స.)

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..

కర్నూలుకు చెందిన 10 మంది కారులో తమిళనాడు రాష్ట్రం తిరునామాలైకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి కారులో తిరుమలకు బయలుదేరారు. మార్గంమధ్యలో పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రమ్యశ్రీ, హేమలత అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ అనే వ్యక్తి మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu