Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సామాన్యుడికి మళ్ళీ షాక్.. మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు

సామాన్యుడికి మళ్ళీ షాక్.. మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు

కర్నూలు, 19 మే (హి.స.) మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో అన్ని రకాల నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డీ విరుస్తుండగా.. నేడు ఇంధన ధరలు మరో షాక్ ఇచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం, లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు మేర భారం పెరిగింది. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని నగరాల్లో ఈ పెంపుదల కనిష్టంగా 80 పైసల నుండి గరిష్టంగా 1.00 రూపాయి వరకు వర్తింపజేశారు. దీంతో నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.89 కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.98.96 కు చేరింది. కాగా సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ ధరల పెంపుదల, రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపనుంది.

ప్రపంచ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు క్రమంగా పెరుగుతుండటంతో, దేశీయంగా ఇంధన ధరలను సవరించక తప్పలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడటం కూడా మరో ప్రధాన కారణం. చమురు దిగుమతుల కోసం భారతదేశం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడంతో ఈ భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వచ్చింది. దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే కేంద్ర ప్రభుత్వం, చమురు నియంత్రణ సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయడం గమనార్హం. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, పోలింగ్ ముగిసిన వెంటనే ఈ భారాన్ని పెంచడంపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu