Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

పుట్టపర్తి(సత్యసాయి), 14 మే (హి.స.): సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ను అధికారులు గురువారం విడుదల చేశారు. ఉండవల్లి నుంచి శుక్రవారం ఉదయం 8.15 గంటలకు ఆయన హెలికాప్టర్లో బయలుదేరి, పుట్టపర్తి విమానాశ్రయానికి ఉదయం 9.45 గంటలకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 10.10 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. నిర్దేశిత కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఉదయం 10.15 గంటలకు చేరుకుంటారు.

యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాన కార్యక్రమంలో ఉదయం 10.15 నుంచి 12.30 గంటల వరకు పాల్గొంటారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు పుట్టపర్తి నుంచి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళ్లి, 12.50 గంటలకు హెలికాప్టర్లో ఉండవల్లికి బయలుదేరుతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu