Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి.. రాజన్న జిల్లా కలెక్టర్

శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి.. రాజన్న జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, 21 మే (హి.స.)

ఉచిత శిక్షణను యువతీ యువకులు వినియోగించు కోవాలని, ఆర్థికంగా ఎదగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.

కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, బ్యాంకుల సహకారంతో ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ శిక్షణా కేంద్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించారు. శిక్షణ ఇచ్చే, ట్రైనింగ్, పరిశీలించారు. ఈ సందర్భంగా మగ్గం వర్క్ కింద శిక్షణ పొంది పలువురు అభ్యర్థులు సిద్ధం చేసిన వస్త్రాలను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజూ ఎన్ని గంటలు శిక్షణ పొందుతున్నారో ఆరా తీశారు. మగ్గం వర్క్ తర్ఫీదు పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఆర్ సెటీ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు మన జిల్లాలో కూడా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జిల్లాలోని యువతీ యువకులు ఇక్కడ అందించే ఉచిత వసతి, భోజనం, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. శిక్షణలో భాగంగా అందించే ప్రతి మెలకువను ఎంతో శ్రద్ధ, ఆసక్తితో నేర్చుకొని.. స్వయం ఉపాధిలో ఆ అంశాలు వినియోగించాలని సూచించారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ.. ఆర్థిక స్వాతంత్రం సాధించాలని ఆకాంక్షించారు. మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మార్కెట్, పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల డిమాండ్ కు అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించాలని, ఏడాది అంతా శిక్షణ అందించాలని నిర్వాహకులకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu