Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆస్పత్రికి హరీశ్ రావు ఏడాది వేతనం విరాళం

శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆస్పత్రికి హరీశ్ రావు ఏడాది వేతనం విరాళం

సిద్దిపేట, 04 జూలై (హి.స.) మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గొప్ప మనసు చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ & రీసెర్చ్ సెంటర్ను హరీశ్ రావు, సినీ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి అందిస్తున్న అమూల్యమైన సేవలను గురించి డాక్టర్లను ఆడిగి తెలుసుకున్నారు. శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి నా ఒక సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ రోజే చెక్ కూడా అందిస్తానన్నారు. ఇంకా ప్రాణం ఉంటుందో.. పోతుందో ఎలా అని కొట్టుమిట్టాడుతున్నట్వంటి వారికి ఇది నిజంగా ఒక దేవాలయం. దేవుడి ఎలా వరమిస్తాడో నేను బతుకుతానో పోతానో అని ఇక్కడికి వచ్చినట్వంటి వారికి ఈ ఆస్పత్రి ప్రాణ ప్రతిష్ట చేస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆగిపోతుంది. గుండెలో రంద్రాలున్నాయి. హార్ట్లో సమస్య ఉందన్నపుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిల్లాడుతుంటాయి. ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలున్నాయి. ఆ పుట్టిన బిడ్డ ఇక బతకడం కష్టమన్నప్పుడు తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయన్నారు.

శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రి ఇప్పుడు ఒక చిన్నారికి శస్త్ర చికిత్స చేసిందంటే నా దృష్టిలో ఒక గుండెను కాపాడలేదు.. ముగ్గురి గుండెలను కాపాడినట్టు. విలవిలలాడే ఆ రెండు గుండెలకు ధైర్యాన్నిచ్చి మీ బిడ్డకు ప్రాణం పోస్తున్నాం అని అటు ప్రాణం పోసిన బిడ్డకు తల్లిదండ్రుల గుండెలకు ప్రాణం పోసినంత గొప్ప అని హరీశ్ రావు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu