Dailyhunt
శ్రీశైలం.: చెంచుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

శ్రీశైలం.: చెంచుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

శ్రీశైలం, 05 మే (హి.స.)

శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పరిధిలోని పెచ్చెరువు గూడెంలో చెంచు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి సొంత నిధులతో 42 మందికి డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అభినందిస్తూ, ప్రభుత్వం, అధికారులు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్ద చెరువు గూడెంలోని ప్రతి కుటుంబానికి సోలార్ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.

డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీల జారీ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇకపై కార్డులు నేరుగా వాహనదారుల ఇళ్లకే చేరుతాయి. దీనివల్ల ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పడమే కాకుండా, ఏజెంట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఏటా సుమారు 15 లక్షల కార్డులను వేగంగా పంపిణీ చేసేలా రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. యూజర్ ఛార్జీల నిధులను ఇందుకోసం వినియోగించనున్నారు అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu