Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం 'డీప్ స్లీప్ మోడ్'లో ఉన్నారు: విజయ్పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యం

సీఎం 'డీప్ స్లీప్ మోడ్'లో ఉన్నారు: విజయ్పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యం

కడలూరు30 మే (హి.స.)

కడలూరులో సుమారు 25 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురవడం తమిళనాడులో రాజకీయ దుమారం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్..

ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ హత్య ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తమిళనాడులో వరుసగా జరుగుతున్న హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

'సోఫా మోడల్ గవర్నమెంట్' అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యలు, దోపిడీలు జరగని రోజంటూ లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయ్ను ఉదయనిధి నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో నోట్స్ చూస్తూ శాంతిభద్రతల గురించి పెద్ద పెద్ద పంచ్ డైలాగులు చెప్పిన వ్యక్తి, ముఖ్యమంత్రి అయ్యాక మొద్దు నిద్ర పోతున్నారు. ఇప్పుడాయన 'డీప్ స్లీప్ మోడ్'లోకి వెళ్లినట్లున్నారు అని ఎద్దేవా చేశారు.

మహిళల భద్రత కోసం ప్రకటించిన 'సింగప్పెన్ ఫోర్స్' ప్రారంభోత్సవ కార్యక్రమం చివరి నిమిషంలో రద్దయిందన్న వార్తలను ఆయన ప్రస్తావించారు. ఆ కార్యక్రమాన్ని కేవలం వాయిదా వేశారా లేక ఆ పథకాన్నే పూర్తిగా పక్కన పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణను ప్రభుత్వం నెమ్మదిగా నేర్చుకునేంత వరకు తమిళనాడు వేచి చూడలేదని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu