Dailyhunt
సీఎం పదవికి హిమంత బిశ్వశర్మ రాజీనామా

సీఎం పదవికి హిమంత బిశ్వశర్మ రాజీనామా

గౌహతి:, 06 మే (హి.స.) అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన క్యాబినెట్ మిత్రులతో సహా ఆయన తన రాజీనామాను గవర్నర్ లక్ష్మణాచార్యకు సమర్పించారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 102 సీట్లతో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఆయన రాజీనామా సమర్పించారు. మే 11వ తేదీ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని హిమంత శర్మ పేర్కొన్నారు. 126 స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu