Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజెవైఎం నాయకుల అందోళన

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజెవైఎం నాయకుల అందోళన

హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శనివారం దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి విద్యార్థులను క్రిమినల్స్గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu