Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సీలేరు.ప్రాంతంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే అంబులెన్స్.మరమ్మత్తులకు.గురి

అమరావతి, 28 మే (హి.స.)

గూడెంకొత్తవీధి మండలం సీలేరు ప్రాంతంలో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. ఇది కదిలే పరిస్థితిలో లేకపోవడంతో ధారకొండ అంబులెన్స్ సహాయంతో తాడు కట్టి పాడేరు గ్యారేజీకు బుధవారం తరలించారు.

కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనుల వైద్యసేవల కోసం ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి, అధిక వినియోగం కారణంగా వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ప్రత్యామ్నాయ వాహనాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu