Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తడిచిన ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేయాలి.. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

తడిచిన ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేయాలి.. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

షాద్నగర్, 28 మే (హి.స.)

అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.

షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోళ్ళను గురువారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో సమావేశమై అకాల వర్షంతో మార్కెట్ కు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని అన్నారు.

ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేసి వారం రోజుల్లోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డీఎం, జిల్లా పౌరసరఫరాల అధికారికి సూచించారు. సన్నరకం ధాన్యాన్ని సాగుచేసిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ తహసీల్దార్ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన, వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu