Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఉరవకొండ, 22 మే (హి.స.)అనంతపురం జిల్లా ఉరవకొండలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఈ రోజు ఉదయం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు.

మండలంలోని షేక్ షాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాచర్ల, మరియు మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న రీ సర్వే పై, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు, రీ సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రీ సర్వేని పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పాటిల్ భోగన్న గౌడ్, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ పవన్ కుమార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ చంద్రశేఖర్ రెడ్డి, మండల సర్వేయర్ రత్నాకర్ బాబు, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వో మహేష్ నాయక్, గ్రామ సర్వేయర్ శ్యామ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu